మరోసారి ‘ఫిదా’ చేస్తారేమో

వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన ఫిదా సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఫిదా తర్వాత సాయి పల్లవి టాలీవుడ్‌ లో నెం.1 హీరోయిన్‌ రేసులో దూసుకు పోతుంది. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాకు ఈమె మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌ లో నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేయాలంటే సాయి పల్లవి తర్వాతే మరెవ్వరైనా అంటూ టాక్ వినిపిస్తుంది. సాయి పల్లవి మరో సారి మెగా హీరోతో ఫిదా చేసేందుకు సిద్దం అయ్యింది.

టాలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం వరుణ్‌ తేజ్ చేస్తున్న ఎఫ్‌ 3 మరియు గని సినిమా ల తర్వాత వెంకీ కుడుమలు దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే కథ కూడా ఓకే అయ్యింది. పల్లెటూరు నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమా లో హీరోయిన్‌ గా నాచురల్‌ బ్యూటీ సాయి పల్లవి అయితే బాగుంటుందనే అభిప్రాయంతో మేకర్స్ ఉన్నారు. పాత్రకు ప్రాముఖ్యత ఉంటే ఖచ్చితంగా సాయి పల్లవి కూడా నటించేందుకు ఓకే అంటున్నారు. కనుక ఈ సినిమా దాదాపుగా కన్ఫర్మ్‌ అయినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.