ఫస్ట్ లుక్ : రోలెన్స్ లుక్ నే బాల వాడేస్తున్నాడా?


తమిళ స్టార్ హీరో సూర్య యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన `విక్రమ్` మూవీలో రోలెక్స్ గా షాకింగ్ మేకోవర్ తో టెర్రిఫిక్ లుక్ లో కనిపించి అదరగొట్టిన విషయం తెలిసిందే. సినిమా క్లైమాక్స్ లో చివరి 5 నిమిషాల పాటు సాగే `రోలెక్స్` పాత్రలో హీరో సూర్య పలికించిన హావ భావాలు సూర్య మేకోవర్ లుక్స్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ప్రతీ ఒక్కరినీ షాక్ కు గురిచేశాయి. బ్రౌన్ కలర్ హెయిర్… బారు గడ్డంతో సూర్య కనిపించిన తీరు `విక్రమ్` క్లైమాక్స్ కు ప్రధాన హైలైట్ గా నిలచింది.

ఈ మూవీతో సూర్య వార్తల్లో నిలిచారు. ఇదిలా వుంటే చాలా ఏళ్ల విరామం తరువాత సూర్య దర్శకుడు బాల కలిసి ఓ సినిమా చేస్తున్నారు. సూర్య నటిస్తున్న 41వ ప్రాజెక్ట్ ఇది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో నటిస్తూనే హీరో సూర్య తన భార్య జ్యోతికతో కలిసి 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు.

హీరో సూర్య ఈ మూవీలో చాలా మాసీవ్ పాత్రలో కనిపించబోతున్నారు. బాల మార్కు కథతో తెరకెక్కుతున్న ఈ మూవీకి `వనంగాన్` పేరుతో రూపొందిస్తున్నారు.

తెలుగులో ఇదే చిత్రాన్ని `అచలుడు`గా రిలీజ్ చేయబోతున్నారు. సోమవారం దర్శకుడు బాల పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి టైటిల్ తో పాటు హీరో సూర్య ప్రీ లుక్ పోస్టర్ ని హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రోలెక్స్ లుక్ లో సూర్య సీరియస్ గా చూస్తున్న స్టిల్ ఆకట్టుకుంటోంది.

ఈ టైటిల్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసిన సూర్య ఆసక్తికరమైన క్యాప్షన్ ని జతచేశాడు. `మీతో మళ్లీ కలవడం చాలా బాగుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య అంటూ దర్శకుడు బాలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తొలి షెడ్యూల్ కన్యాకుమారిలో పూర్తి చేసుకుంది. ఆ తరువాత గోవాలో ప్రత్యేక షెడ్యూల్ ని చేశారు. ప్రస్తుతం సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సూర్య – బాల కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలవనుందని చెబుతున్నారు. సూర్య లుక్ రోలెక్స్ లుక్ ని గుర్తు చేస్తోందని అదే లుక్ ని బాల ఈ మూవీ కోసం కంటిన్యూ చేశాడా? అనే అనుమానాల్ని నెటిజన్ లు వ్యక్తం చేస్తున్నారు.