గీతా గోవిందం సీక్వెల్ రూమర్స్… మళ్ళీ తెరపైకి

విజయ్ దేవరకొండ కెరీర్ లో హిట్స్ బాగానే ఉన్నాయి. పెళ్లి చూపులు తనకు ఫస్ట్ హిట్ కాగా, అర్జున్ రెడ్డిని గేమ్ ఛేంజెర్ గా చెప్పుకోవచ్చు. అయితే విజయ్ కెరీర్ లో అతిపెద్ద హిట్ అంటే మాత్రం గీత గోవిందం అనే చెప్పుకోవాలేమో. పెట్టిన పెట్టుబడికి దాదాపు రెండింతలు లాభాలు ఈ సినిమా ద్వారా సాధ్యమయ్యాయి.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఇక పాటలు గురించి చెప్పేదేముంది. ముఖ్యంగా ఇంకేం కావాలె సాంగ్ సెన్సేషన్ అయింది. పరశురామ్ టేకింగ్, కామెడీ ఈ సినిమాకు కాపు కాసాయి. ఈ సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత దీనికి సీక్వెల్ అంటూ రూమర్స్ వచ్చాయి కానీ అది జరగలేదు.

అయితే ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ సీక్వెల్ రూమర్స్ వస్తున్నాయి. గీత గోవిందం సీక్వెల్ కు పరశురామ్ కథ అందిస్తాడట. కాకపోతే తన అసిస్టెంట్ లలో ఒకరు ఈ సీక్వెల్ కు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. మరి విజయ్ దేవరకొండ ఈ సీక్వెల్ లో నటిస్తాడా లేక వేరే యువ నటుడు ఎవరైనా ఆ పాత్రను పోషిస్తారా అన్నది ఇంకా తెలియలేదు. మరి కొన్ని రోజులు ఆగితే కానీ ఈ విషయంపై పూర్తి క్లారిటీ రాదు.