సందీప్ కిషన్, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘గల్లీ రౌడీ’. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ వి.వి.వినాయక్, డైరెక్టర్ నందినీ రెడ్డి విడుదల చేశారు. చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో నవంబర్ 22న కథను విని, డిసెంబర్ 16నుంచి షూటింగ్‌ను వైజాగ్‌లో స్టార్ట్ చేశాం. సందీప్ తాను ఎంచుకున్న కథకు హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అయ్యాడు. కథ విన్న వెంటనే హిట్ అని అర్ధమైంది’ అన్నారు.
‘రాజేంద్ర ప్రసాద్‌గారితో కలిసి పనిచేసే అదృష్టం కలిగింది. బాబీ సింహ, వెన్నెల కిషోర్, పోసాని ఇలా మంచి క్యాస్టింగ్ కుదిరింది. ఇది మరో ఢీ లాంటి సినిమా అని చెప్పగలను. ఒక వైపు టెన్షన్ ఉంటూ మరో వైపు ఫన్ ఉండే సినిమా మ గల్లీ రౌడీ. ఏ కామెడీతో నాకు పేరొచ్చిందో.. అలాంటి కామెడీతో పాటు మంచి ఎమోషన్ ఉండే సినిమా ఇది’ అని నాగేశ్వర్ రెడ్డి అన్నారు.