అంచనాలు మరీ పెంచేస్తున్నాడు

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవి వచ్చి ఆరు సంవత్సరాలు దాటింది. ఇప్పటికి కూడా ఆయన తదుపరి సినిమాను విడుదల చేయలేదు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. శాకుంతలం సినిమా ను ఆయన ఎంతో శ్రద్ద పెట్టి తెరకెక్కిస్తున్నాడు. సమంత ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో శాకుంతలం సినిమాపై అంచనాలు పెంచేలా వ్యాఖ్యలు చేసింది. సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కువ అప్ డేట్స్ ఏమీ రాలేదు. అయినా కూడా సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

గుణశేఖర్ శాకుంతల మరియు దుష్యంతుడి పాత్రలకు ఎంపిక చేసుకున్న నటీ నటులను మొదలుకుని అన్ని విషయాల్లో కూడా ఆయన నిర్ణయాలు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమాలో కీలక పాత్ర కోసం అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హను ఎంపిక చేయడం తో పాటు ఇంకా సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటీ నటులు కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా లో కీలక పాత్రకు గాను బుల్లి తెర హాట్ బ్యూటీ కామెడీ స్టార్స్ యాంకర్ వర్షిణి ని ఎంపిక చేయడం జరిగింది. ఆమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. వెబ్ సిరీస్ లు చేసింది. ప్రస్తుతం బుల్లి తెరపై క్రేజీ బ్యూటీగా దూసుకు పోతుంది. ఢీ మరియు పటాస్ షో లతో బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గర అయిన ఈ అమ్మడు ప్రస్తుతం కామెడీ స్టార్స్ తో మా టీవీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. ఇప్పుడు వర్షిణికి మోస్ట్ అవైటెడ్ మూవీ శాకుంతలంలో నటించే అవకాశం రావడం జరిగింది. ఒక్కసారిగా ఈమె గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

పాన్ ఇండియా మూవీ లో వర్షిణి ఎంపిక అవ్వడంతో ముందు ముందు ఆమెకు మరిన్ని ఆఫర్లు వస్తాయనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ లో వర్షిణి ఇప్పటికే జాయిన్ అయ్యిందని తెలుస్తోంది. శాకుంతలం సినిమా లో వర్షిణి పాత్ర ఏంటీ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సమంత మరియు వర్షిణి కాంబోలో సన్నివేశాలు ఉంటాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. షూటింగ్ లో వర్షిణి ని ఈ సినిమాకు ఎంపిక చేయడం వల్ల ఖచ్చితంగా బజ్ క్రియేట్ అయ్యిందని.. బుల్లి తెర క్రేజీ బ్యూటీ వల్ల ఖచ్చితంగా శాకుంతలంకు కాస్త ఎక్కువ మైలేజ్ దక్కే అవకాశాలు ఉన్నాయి. అర్హ మరియు వర్షిణి ఎంపిక నిర్ణయంతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అంచనాలు మరీ పెరుగుతున్నాయి.. మరి గుణశేఖర్ అంచనాలను అందుకుంటాడా అనేది చూడాలి.