హాట్ బ్యూటీ హన్సిక 50వ సినిమాగా రూపొందిన ‘మహా’ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా వేశారు. ఈ సినిమా ను థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయానికి వచ్చారు. ఈ సమయంలో సినిమా దర్శకుడు జమీల్ హైకోర్టును ఆశ్రయించాడు. సినిమా ను తన ప్రమేయం లేకుండా పూర్తి చేశారని.. తాను అనుకున్నట్లుగా కాకుండా కొత్త కథతో ఈ సినిమాను రూపొందించారంటూ జమీల్ కోర్టులో పేర్కొన్నాడు. ఈ సినిమా ను చేసినందుకు తనకు ఇవ్వాల్సిన పారితోషికం కూడా ఇవ్వలేదంది.
హన్సిక 50వ సినిమా అవ్వడంతో ప్రేక్షకులు ముఖ్యంగా తమిళ ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని సినిమా విడుదల తేదీ విషయంలో గందరగోళం ఏర్పడటం ఆ తర్వాత కోర్టు కేసులో చిక్కుకుంది. దర్శకుడితో సినిమా నిర్మాతలు ఒప్పందం చేసుకుంటే పర్వాలేదు కాని కోర్టు తీర్పు వచ్చే వరకు సినిమా విడుదల వాయిదా వేయాల్సిందే. హన్సిక ఈ సినిమాలో ఆమె ప్రియుడు శింబు తో కలిసి నటించింది. మహా సినిమా లో హన్సిక లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.