తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక భాషల్లో పాడి కొన్ని కోట్ల మంది అభిమానంను చురగొన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటలు ఆయన లేకున్నా కూడా ప్రతి రోజు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన పాడిన వేల పాటలు ఇంకా జనాల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఏదైనా సంగీతంకు చెందిన కార్యక్రమం అంటే అక్కడ బాలు పాడిన పాట లేకుండా ఉండదు. తాజాగా విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఒక కార్యక్రమంలో బాలు పాడిన పాటను పాడి అందరిని ఆకట్టుకున్నాడు.
విజయనగరంలో గురజాడ కళా భారతి ఆడిటోరియంలో స్వరాల సందమామ సంగీత విభావరిలో కలెక్టర్ హరిజవహర్‌లాల్ సిరివెన్నెల చిత్రంలోని ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు పాటను పాడారు. బాలు పాడిన ఆ పాట ఇప్పటికి ఎప్పటికి అద్బుతమైన ఆణిముత్యం అనడంలో సందేహం లేదు. అలాంటి పాటను కలెక్టర్ పాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. పాటలపై ఉన్న ఆసక్తితో తాను ఈ పాట పాడినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.