ఈటెల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ కు ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. అక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కౌశిక్ ఉంటాడని అంతా భావించారు. కాని ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా కొత్త రాజకీయంకు కేసీఆర్ తెర తీశారు. హుజూరాబాద్ వెదికగా కేసీఆర్ దళిత బంధును ప్రవేశ పెట్టబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ దళితులకు సంబంధించిన 95 శాతం ఓట్లు టీఆర్‌ఎస్ కు పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
దళిత బంధు పథకం మాత్రమే కాకుండా దళితులకు సీటు ఇవ్వాలనే నిర్ణయానికి కూడా వచ్చారని హరీష్ రావు మాటల ద్వారా తెలుస్తోంది. దళిత అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తాడని.. బీజేపీ నాయకులు దళితుల ఓట్లను చీల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆరోపించారు. దళిత బంధు పతకం ప్రభుత్వం అమలు చేస్తుంటే అంతా భయపడుతున్నారు అంటూ హరీష్ రావు పేర్కొన్నాడు. మోడీ ఫొటో లేకుండా ఈటెల ప్రచారం చేస్తున్నాడని హరీష్ రావు ఎద్దేవ చేశాడు.