లొకేషన్స్ వేటలో పడ్డ హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోన్న విషయం తెల్సిందే. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ విజయం సాధించడంతో ఈ చిత్రంపై సాధారణంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో తన తర్వాతి చిత్రాలపై ఫోకస్ పెట్టనున్నాడు. ప్రొడక్షన్ మొదలుకానుండడంతో హరీష్ శంకర్ బిజీ అయ్యాడు. ప్రస్తుతం లొకేషన్స్ వేటలో ఉన్నట్లు సమాచారం. అలాగే కాస్ట్ అండ్ క్రూ ను కూడా ఫైనల్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేసారు.

పూజ హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తాడు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.