సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనల్లుడు.. గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా నిర్మించిన `హీరో` ఈ నెల 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అతిధి పాత్రలో నటించారని సమాచారం. బ్లాక్ బస్టర్ మేకర్ కనిపించేది కొద్దిసేపే అయినా ప్రభావం చూపే పాత్రలో కనిపిస్తారు. అయితే ఆ పాత్ర గురించి తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం సాయంత్రం జరగనుండగా ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దగ్గుబాటి రానా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. సమీర్ రెడ్డి – రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా.. జిబ్రాన్ సంగీతం అందించారు. చంద్రశేఖర్ రావిపాటి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సినిమా ట్రైలర్ పాటలకు ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది. బజ్ చాలా పాజిటివ్ గా ఉంది. విడుదలకు ముందే ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ తో మేకర్స్ హైప్ ని మరింత పెంచుతున్నారు.