నాని ఈ ఏడాది ఏం చేయబోతున్నాడు?

న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ విషయంలో పక్కా ప్లానింగ్ తో వెళ్తాడు. సినిమా సినిమాకు మధ్య కనీసం 4-5 నెలలు గ్యాప్ ఉండేలా చూసుకుంటాడు. ప్రతీ ఏడాది కనీసం 2 లేదంటే 3 చిత్రాలను రిలీజ్ చేస్తుంటాడు. ఇంత కన్సిస్టెంట్ గా సినిమాలు విడుదల చేసే హీరో టాలీవుడ్ లో లేరు అంటే అతిశయోక్తి కాదు.

ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం మూడు ప్రాజెక్టులకు కమిటై ఉన్నాడు. టక్ జగదీష్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. విడుదలకు సిద్ధంగా ఉంది. జులై లేదా ఆగస్ట్ లో విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. శ్యామ్ సింగ రాయ్ కూడా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

మరో నెల రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. టక్ జగదీష్ ను కనుక ఆగస్ట్ లో విడుదల చేయగలిగితే శ్యామ్ సింగ రాయ్ డిసెంబర్ లో వచ్చేయొచ్చు. మరి టక్ జగదీష్ ఆలస్యమైతే మాత్రం ఈ ఏడాది ఇక శ్యామ్ సింగ రాయ్ రాడు. మరి నాని రెండు సినిమాలను ఈ ఏడాది విడుదల చేయగలడా?