కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడితో జత కట్టిన రాజశేఖర్

హీరో రాజశేఖర్ కోవిద్ నుండి కోలుకున్న తర్వాత భారీ గ్యాప్ ను తీసుకున్నాడు. అయితే ఇప్పుడు వరస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇటీవలే శేఖర్ అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసాడు రాజశేఖర్. కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో తనేంటో నిరూపించుకున్న వెంకటేష్ మహా దర్శకత్వంలో నటించనున్నాడు.

సత్యదేవ్ హీరోగా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాను రూపొందించిన మహా మూడో సినిమాగా రాజశేఖర్ తో జతకట్టాడు. ఈ సినిమాకు మర్మాణువు అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మికతో కలిసి విజయ ప్రవీణ పరుచూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకత్వం వహిస్తాడు.