ఎక్స్‌క్లూజివ్‌ః రామ్‌, లింగుస్వామి సినిమా చర్చలు

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ ఇటీవలే రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా నిరాశ పర్చింది. ఇప్పటి వరకు రామ్ తదుపరి సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆ మద్య త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆయన సినిమా ఉంటుందని అంటున్నారు. కాని త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.

రామ్ తదుపరి సినిమా విషయంలో మరింత స్పష్టత ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా తమిళ స్టార్‌ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో రామ్ సినిమా రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబో కోసం కథ చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే సినిమా పట్టాలెక్కే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. కథ మరియు ఇతర విషయాలు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చాయని, స్రవంతి రవికిషోర్‌ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.