రానా బాహుబలి సినిమాలో నటించిన భల్లాలదేవ పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి పాత్రలో నటించిన రానా మళ్లీ ఇన్నాళ్లకు అంత కష్టపడి అరణ్య సినిమాలో నటించాడట. తాజాగా అరణ్య సినిమా విడుదల సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను భల్లాలదేవ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. కాని అరణ్య సినిమా కోసం మాత్రం అంతకు మించి కష్టపడ్డాను అంటూ సినిమాపై అంచనాలు భారీగా పెంచేలా వ్యాఖ్యలు చేశాడు.
ఏనుగులతో మచ్చిక చేసుకోవడం కోసం షూటింగ్ వారం రోజులు ఉండగానే వాటితో గడపడం మొదలు పెట్టే వాడిని. ఎప్పుడు నా వద్ద అరటి పండ్లు పెట్టుకుని వాటితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించే వాడిని. ఒక సారి నా పాకెట్ లో అరటి పండ్లు ఉన్న విషయం చూసి ఒక్కసారి చాలా ఏనుగులు నా చుట్టు చేరాయి. ఆ సమయంలో చాలా ఆందోళన చెందాను. అసలు ఏం జరుగుతుందా అని కొన్ని సెకన్లు టెన్షన్ పడ్డాను అన్నాడు.