పిక్ టాక్: పాన్ ఇండియా సూపర్ హీరో కోసం డీప్ డిస్కషన్..!

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ – యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ”హను-మాన్”. ‘జాంబీ రెడ్డి’ వంటి సూపర్ హిట్ తర్వాత సినీ ప్రియులకు మరో కొత్త జోనర్ చిత్రాన్ని పరిచయం చేయడానికి వీరిద్దరూ మరోసారి జత కట్టారు. ఇది ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీ. తెలుగుతో పాటుగా పలు ఇతర ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ – ఫస్ట్ లుక్ – మోషన్ పోస్టర్ లకు విశేష స్పందన లభించింది.

అంజనాద్రి ప్రపంచంలో హనుమంతుడి పరిచయం అంటూ వచ్చిన ”హను-మాన్” ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. ప్రశాంత్ వర్మ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఓ ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాడని హింట్ ఇచ్చాడు. అటవీ ప్రదేశాలు – కొండ ప్రాంతాలు వంటి అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. తాజాగా హీరో తేజ సజ్జా – డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లొకేషన్స్ లో సీన్స్ గురించి డిస్కష్ చేస్తున్న ఫోటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

తేజ సజ్జా ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. ”మేము దేని గురించి చర్చిస్తున్నామో ఎవరైనా ఊహించగలరా? హనుమాన్ లోడింగ్” అని పేర్కొన్నారు. సూపర్ హీరోగా నటించడానికి యువ హీరో అద్భుతమైన మేకోవర్ అయ్యాడని ఈ ఫోటో చూస్తే అర్థం అవుతుంది. కోరమీసం – రఫ్ గా కనిపించే గడ్డంతో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో కొత్తగా ఉన్నాడు.

‘అ!’ ‘కల్కి’ ‘జోంబీ రెడ్డి’ వంటి డిఫరెంట్ జోనర్ సినిమాలతో కమర్షియల్ విజయాలు అందుకుంటున్న ప్రశాంత్ వర్మ.. తేజ సజ్జాతో కలసి ఇప్పుడు ”హను-మాన్” తో మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

”హను-మాన్” చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ – టాప్ టెక్నిషియన్స్ భాగం అవుతున్నారు. స్క్రిప్ట్ విల్లే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషలలో రూపొందనున్న ఈ సూపర్ హీరో చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.