హీరోయిన్‌ 10 మంది కుటుంబ సభ్యులు పాజిటివ్‌


సౌత్‌ లో ఈమద్య కాలంలో వరుసగా సినిమాల్లో కనిపిస్తున్న హాట్‌ బ్యూటీ డింపుల్‌ హయతి. ఈ అమ్మడు మొన్నటి వరకు చెన్నైలో ఉంది. షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌ చేరుకుంది. హైదరాబాద్‌ లో సోమవారం ల్యాండ్‌ అయిన డింపుల్‌ తన కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతుందట. చెన్నైలో ఉండే డింపుల్‌ కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారట. ఆమె తాత గారు కరోనాతో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లుగా పేర్కొంది.

సోషల్‌ మీడియా ద్వారా డింపుల్‌.. మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. మా కుటుంబంలోని అందరికి కరోనా పాజిటివ్‌ గా నిర్థారణ అయ్యింది. పది మంది కూడా కరోనాతో బాధపడుతున్నారు. తాతగారు కరోనా కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ఆయన్ను వైధ్యలు చాలా శ్రద్దగా ట్రీట్‌ చేస్తున్నారు. త్వరలోనే తాతగారు మా మద్య కు వస్తారని ప్రతి ఒక్కరం ఆశిస్తున్నామని చెప్పుకొచ్చింది. ఇతర కుటుంబ సభ్యులు స్వల్ప లక్షణాలతోనే ఉన్నారని కూడా పేర్కొంది.