షాకింగ్: ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న ‘ఎఫ్-2’ హీరోయిన్ మెహ్రీన్..!


టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా ఇటీవల గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువనేత భవ్య బిష్ణోయ్ ను పెళ్లి చేసుకోడానికి రెడీ అయింది. కరోనా కారణంగా వివాహం వాయిదా పడింది. అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు అనుకుంటున్న సమయంలో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది.

భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్లు ట్విట్టర్ వేదికగా మెహ్రీన్ ప్రకటించేసింది. ఇద్దరం ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. భవ్య బిష్ణోయ్ మరియు అతని కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం ఉండబోదని హీరోయిన్ స్పష్టం చేసింది. తన వ్యక్తిగత విషయాన్ని అందరూ గౌరవిస్తారని అనుకుంటున్నానని.. ఇకపై సినిమాలపైనే దృష్టి పెడతానని లేఖలో పేర్కొంది.

”నేను భవ్య బిష్ణోయ్ పెళ్లితో ముందుకు వెళ్లకూడదని.. మా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. ఇది ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. ఇది నా మనస్ఫూర్తిగా గౌరవంతో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటి నుండి నాకు భవ్య బిష్ణోయ్ అతని కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఎవరితోనూ సంబంధం లేదు. దీనికి సంబంధించి నేను చేస్తున్న ఏకైక ప్రకటన ఇది. మా ప్రైవేట్ మ్యాటర్ కాబట్టి ప్రతి ఒక్కరూ నా గోప్యతను గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ఇకపై నా పని కంటిన్యూ చేస్తాను. నా ఫ్యూచర్ ప్రాజెక్టులలో నా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను” అని మెహ్రీన్ పేర్కొన్నారు.

ఇకపోతే మెహ్రీన్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఎఫ్ 3’ షూటింగ్ లో ఈరోజు తిరిగి జాయిన్ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కు జోడీగా ఈ బ్యూటీ నటిస్తోంది.