భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోన్న ప్లాప్ హీరోయిన్లు

ప్రస్తుతం కరోనా కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సఫర్ అవుతోంది. కొన్ని వందల కోట్ల నష్టం వాటిల్లింది. అయితే ఆర్టిస్ట్ లు తమ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం పట్టు విడవకపోవడం కొంచెం వింతగా అనిపిస్తోంది. హిట్స్ లో ఉన్న వాళ్ళు, డిమాండ్ ఉన్న వాళ్ళు భారీ రెమ్యునరేషన్ కోట్ చేసారన్నా అర్ధం ఉంది. కానీ ప్లాప్ లో హీరోయిన్స్ కూడా తమ మార్కెట్ కు మించి పారితోషికాన్ని డిమాండ్ చేస్తుండటమే ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం.

ఉదాహరణకు రాశి ఖన్నాను తీసుకుంటే వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత ఆమె మార్కెట్ పడిపోయింది. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తోంది రాశి ఖన్నా. ఒకటి నాగ చైతన్య చిత్రం థాంక్యూ, మరొకటి గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్. ఈ సినిమాలకు కోటికి తగ్గకుండా పారితోషికం తీసుకుంటోంది రాశి. ఇక పెద్దగా సినిమాలు లేని మెహ్రీన్ కూడా 50 లక్షలు డిమాండ్ చేస్తోందిట. ఎఫ్3 తర్వాత మారుతి సినిమాకు 50 లక్షలు డిమాండ్ చేసిందీ భామ.