ప్రముఖ నటికి పితృ వియోగం

ప్రముఖ సీరియల్‌ ఆర్టిస్ట్‌ కమ్‌ సినిమా ఆర్టిస్ట్‌ హీనా ఖాన్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రస్తుతం హీనా ఖాన్ షూటింగ్‌ నిమిత్తం కాశ్మీర్ లో ఉండగా ఆమె తండ్రి ముంబయిలో మృతి చెందాడు. నిన్న హీనా ఖాన్ తండ్రి గుండె పోటుతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే హీనా కాశ్మీర్‌ నుండి హుటా హుటిన ముంబయికి చేరుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

హీనా తండ్రి మృతిపై ఆమె సన్నిహితులు మరియు మిత్రులు సంతాపం తెలియజేశారు. తండ్రి మరణంతో రెండు వారాల పాటు పూర్తిగా షూటింగ్‌ లకు హీనా దూరంగా ఉంటుందని ఆమె మేనేజర్ పేర్కొన్నాడు. షూటింగ్‌ లకు బ్రేక్ ఇచ్చి కుటుంబంతో గడుపబోతుందట. పలువురు హీనా తండ్రి మృతిపై సంతాపం తెలియజేసి తమ సానుభూతి తెలియజేశారు. హీనాతో ఇండస్ట్రీ ప్రముఖులు మాట్లాడినట్లుగా తెలుస్తోంది. బుల్లి తెరపై సంచలనం సృష్టించి వెండి తెరపై కూడా తనకంటూ గుర్తింపు దక్కించుకున్న హీనా కుటుంబంలో విషయం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్ అయ్యింది.