‘హిట్‌ 2’ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది


విశ్వక్‌ సేన్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో నాని నిర్మించిన హిట్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో హిట్ 2 అంటూ కొత్త సినిమాను తీసుకు వస్తున్నారు. ఇది సీక్వెల్‌ కాదు కాని అదే జోనర్‌ లో అతే తరహా క్రైమ్‌ కథతో రాబోతుంది. హిట్ సినిమాలో ఒక కేసును తీసుకుని దాని నేపథ్యంలో కథను అల్లి సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు హిట్ 2 లో కొత్త కేసు కొత్త ఆఫీసర్‌ అంటే మరో హీరో అన్నట్లు. మొదటి కేసును విశ్వక్ సేన్‌ పరిష్కరించగా రెండవ కేసును అడవి శేషు పరిష్కరించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.

తాజాగా హిట్‌ సినిమా రెండవ పార్ట్‌ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో అడవి శేషు డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. కుక్క మరియు అడవి శేషు ఫేస్ లను ఫస్ట్‌ లుక్ పోస్టర్ లో చూపించడంతో కథ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ను చేస్తున్నారు. ఒకటి రెండు వారాల్లోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమా ను ఇదే ఏడాదిలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. నాని సోదరి ప్రశాంతి ఈ సినిమాకు మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.