నోరు జారి పెళ్లి విషయం చెప్పేసిన హైపర్‌ ఆది

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు హైపర్‌ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన చేసే జబర్దస్త్‌ స్కిట్‌ లతో పాటు ఎక్కడ కనిపించినా కూడా వేసే పంచ్ లు మరియు డైలాగ్ లు అందరిని నవ్విస్తూనే ఉంటాయి. ఇటీవల ఈయన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో మెరిసిన విషయం తెల్సిందే. ఆ సినిమా సక్సెస్ మీట్‌ సందర్బంగా ఆది మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టాడు. చాలా రోజులుగా ఆది పెళ్లి గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ విషయం పై క్లారిటీ ఇచ్చాడు.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా సక్సెస్‌ మీట్‌ లో మాట్లాడిన సమయంలో ప్రదీప్ గురించి ఎమోషనల్‌ గా మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో యాంకర్‌ శ్యామల మీరు ఎప్పుడైన ప్రేమలో పడ్డారా అంటూ ప్రశ్నించగా ఆది స్పందిస్తూ ప్రేమ వరకు ఎక్కడ వెళ్లాను అండి.. డైరెక్ట్‌ గా’ అంటూ ఆ తర్వాత నవ్వేసి నాలుక కరచుకుని అక్కడ నుండి వెళ్లి పోయాడు. ప్రేమలో పడకుండానే ఆది పెళ్లికి సిద్దం అవుతున్నట్లుగా దీంతో క్లారిటీ వచ్చిందని జనాలు అనుకుంటున్నారు. ప్రేమలో పడకుండా డైరెక్టర్ గా పెళ్లి చేసుకుని ఆ తర్వాత ప్రేమలో పడాలని హైపర్‌ ఆది భావిస్తున్నాడేమో అంటూ అభిమానులు అంటున్నారు.

Share