రోజా చేసిన సహాయం గుర్తుచేసుకుని కన్నీళ్ల పర్యంతమైన హైపర్ ఆది

జబర్దస్త్ లో ఇప్పుడు టాప్ టీమ్ ఏదంటే కచ్చితంగా హైపర్ ఆది పేరు వినిపిస్తుంది. సుడిగాలి సుధీర్ కు ధీటుగా దూసుకొచ్చిన హైపర్ ఆది, ఆ తర్వాత వాళ్లకు అందనంత ఎత్తుకి వెళ్ళిపోయాడు. గతంలో నాగబాబు జబర్దస్త్ వదిలి వెళ్లిపోవడంతో హైపర్ ఆది కూడా నాగబాబు వెనకాల వెళ్లిపోదామనుకున్నాడు. మెగా ఫ్యామిలీ అంటే హైపర్ ఆదికి ప్రత్యేకమైన అభిమానం.

అయితే జబర్దస్త్ ను వదిలి వెళ్లేముందు రోజాను సంప్రదించగా ఆమె వారించినట్లు తెలిసింది. జబర్దస్త్ తరహాలో మరో షో సక్సెస్ కావడం అనేది అంత సులువుగా జరిగే విషయం కాదని ఆమె చెప్పడంతో హైపర్ ఆది జబర్దస్త్ లోనే ఉండిపోయాడు.

ఇదిలా ఉంటే జబర్దస్త్ కు పోటీగా నాగబాబు ప్రోత్సాహంతో పెట్టిన అదిరింది షో బోలెడన్ని వివాదాల్లో చిక్కుకుని ఇప్పుడు ఆపేసే పరిస్థితి వరకూ వచ్చింది. దీంతో ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసుకుని రోజాను తలుచుకుని తనకు ఇంత సహాయం చేసినందుకు కన్నీళ్ల పర్యంతమయ్యాడు హైపర్ ఆది.