మరో అమ్మాయిని రంగంలోకి దించిన హైపర్ ఆది

జబర్దస్త్ కామెడీ షో అనేది తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోనే టాప్‌ బుల్లి తెర కామెడీ షో అనడంలో సందేహం లేదు. సుదీర్ఘ కాలంగా జబర్దస్త్‌ షో రేటింగ్ టైటిల్ కు తగ్గట్లుగా జబర్దస్త్‌ గా వస్తుంది. కమెడియన్స్ మారుతున్నారు, జడ్జ్‌ గా చేసిన నాగబాబో పోయాడు అయినా కూడా రేటింగ్ మాత్రం తగ్గలేదు. క్రేజ్‌ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇక జబర్దస్త్ అనగానే ఎక్కువ మందికి మగవారు లేడీ గెటప్ లు వేసుకుని రావడం గుర్తుకు వస్తుంది. చమ్మక్ చంద్ర ఆ కామెడీకి తెర లేపాడు. అప్పటి నుండి ఎంతో మంది లేడీ గెటప్ లు వేశారు.

హైపర్ ఆది వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. షో కు మరింత గ్లామర్ యాడ్‌ చేసే ఉద్దేశ్యంతో లేడీ పాత్రలకు రియల్ లేడీస్ ను తీసుకు వచ్చాడు. ఎంతో మంది అమ్మాయిలను సీనియర్‌ నటీ నటులను హైపర్ ఆది తీసుకు వచ్చాడు. ఆయన స్కిట్ ల్లో వచ్చే అమ్మాయిలకు మంచి క్రేజ్ దక్కుతుంది. వర్ష కూడా గతంలో ఆది స్కిట్‌ లో వచ్చిందనే విషయం తెల్సిందే. ఆతర్వాత చాలా మంది అమ్మాయిలు కూడా ఆది స్కిట్స్ లో వచ్చి మంచి పేరు దక్కించుకున్నారు. ఇప్పుడు ఆది మరో కొత్త అమ్మాయిని తీసుకు వచ్చాడు. పోలీస్‌ గెటప్ లో వచ్చిన కొత్త అమ్మాయి బాగుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆమెకు కూడా ఆది లైఫ్ ఇచ్చినట్లే అంటున్నారు.