ఆది గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న దొరబాబు

జబర్దస్త్‌ లో హైపర్ ఆదికి ప్రత్యేకమైన స్థానం ఉంది అనడంలో సందేహం లేదు. ఆయన కామెడీ టైమింగ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. అందుకే ఆయన టీమ్ లో చేసేందుకు చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఆది టీమ్‌ లో దొరబాబు మరియు పరదేశీలు గతంలో ఒక కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లారు. ఆ సమయంలో రోజా సాయంతో ఆది వారిని బయటకు తీసుకు వచ్చాడు. ఆ విషయం అందరికి తెలిసిందే. ఇక లాక్‌ డౌన్‌ సమయంలో తన టీమ్ మెంబర్స్ కు ఆది చాలా సాయం చేశాడు.

ఆది తన టీమ్‌ మెంబర్స్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వారికి అండగా నిలిచాడు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో వారికి ఆర్థికంగా వెసులుబాటు కలిగించేలా ముందస్తు పేమెంట్లు ఇవ్వడంతో పాటు తనకు తోచిన సాయంను చేయడం ద్వారా కష్టకాలంలో తోటి వారిని ఆదుకున్నాడు. ఇక ఆది గురించి ఇటీవల దొరబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతడు నాకు చేసిన సాయం చాలా పెద్దదంటూ కన్నీరు పెట్టుకున్నాడు.