పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమాకు అంతర్జాతీయ టచ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కు ముందు జరిగిన విషయం తెల్సిందే. ఇటీవలే క్రిష్ ఈ సినిమా గురించి అప్డేట్ ఇస్తూ ఇప్పటివరకూ 15 రోజుల షూటింగ్ జరిగినట్లు క్లారిటీ ఇచ్చారు. పీరియాడిక్ నేపథ్యంలో సాగే బందిపోటు తరహా చిత్రమిది. పవన్ కళ్యాణ్ సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. విఎఫ్ఎక్స్ వర్క్ ఈ సినిమాకు చాలా ఎక్కువ ప్రాధాన్యముండడంతో అంతర్జాతీయ నిపుణులను తీసుకొచ్చారు.

బెన్ లాక్ అనే విఎఫ్ఎక్స్ నిపుణుడు ఈ సినిమా కోసం పనిచేయనున్నాడు. హాలీవుడ్ లో పలు భారీ చిత్రాలకు బెన్ లాక్ పనిచేసాడు. స్టార్ వార్స్, ఆక్వామ్యాన్, బంబుల్ బీ, డి వాండెరింగ్ ఎర్త్ వంటి భారీ చిత్రాలకు పనిచేసాడు. ఇప్పుడు అంతర్జాతీయ నిపుణుడిని ఈ సినిమా కోసం తీసుకోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

క్రిష్ సినిమా కాకుండా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, హరీష్ శంకర్ చిత్రం, సురేందర్ రెడ్డి చిత్రాన్ని కూడా చేయనున్న విషయం తెల్సిందే.