సూపర్‌ స్టార్‌ కూతురు ప్రేమ విషయం ఇప్పుడు అఫిషియల్‌

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్‌ కూతురు ఐర ఖాన్ గత కొంత కాలంగా మీడియాలో ఉంటూనే వస్తోంది. ఆమద్య ఈమె సినిమాల్లో నటించే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత హాట్ ఫొటో షూట్‌లతో అందరిని ఆకట్టుకుంటూ చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఈమె ప్రేమ వ్యవహారం గురించి కొంత కాలంగా మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఈమె తన ప్రేమ విషయాన్ని హింట్ ఇస్తూ వచ్చింది. ఎట్టకేలకు అధికారికంగా తన ప్రేమ విషయాన్ని అనౌన్స్ చేయడంతో పాటు ప్రియుడి తో ఉన్న రొమాంటిక్ ఫొటోలను కూడా షేర్‌ చేసింది.

ఇరా ఖాన్‌ మొదట మిషాల్‌ను ప్రేమించింది. కాని కొన్ని కారణాల వల్ల 2019 సంవత్సరంలో ఆయనతో ఇరా విడిపోయింది. మళ్లీ కొన్నాళ్లుగా అమీర్ ఖాన్‌ కు ఫిట్‌ నెస్ కోచ్‌ గా వ్యవహరిస్తున్న నుపూర్‌ షిఖరేతో ఇరా ప్రేమలో ఉన్నట్లుగా పుకార్లు వచ్చాయి. అవి నిజమే అన్నట్లుగా ఐర ఖాన్‌ ఫొటోలను విడుదల చేసి అందరిని ఆశ్చర్యపర్చింది. ఈ అమ్మడి జోరు చూస్తుంటే ఇదే ఏడాదిలో ఈమె వివాహం జరిగే అవకాశం ఉంది. మరి కొందరు మాత్రం ఈమె ఈసారి అయినా పెళ్లి పీఠల వరకు వెళ్లబోతుందా అంటూ కామెంట్‌ చేస్తున్నారు.