కేంద్ర ఐటీ శాఖ మంత్రికి ట్విట్టర్ షాక్..! మంత్రి కౌంటర్లు.

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ట్విట్టర్ షాకిచ్చింది. ఆయన ఖాతాను రెండు గంటలపాటు నిలిపివేసి ఆ తర్వాత పునరుద్దరించింది. కొన్నిరోజులుగా ట్విట్టర్, కేంద్రం మధ్య విబేధాలు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు జరిగిన ఘటన సంచలనం రేపింది. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్లోనే వెల్లడించారు. ‘ఫ్రెండ్స్.. ఈరోజు ఓ విచిత్రం జరిగింది. ట్విట్టర్ రెండు గంటలపాటు నా యాక్సెస్ నిలిపేసింది. కొత్త ఐటీ చట్టాల నేపథ్యంలోనే నా అకౌంట్ నిలిపివేసి తర్వాత పునరుద్దరించింది’.

‘నా గత టీవీ ఇంటర్వ్యూలపై ఫిర్యాదులు వచ్చినందునే యాక్సెస్ నిలిపివేశామని ట్విట్టర్ చెప్తోంది. కానీ.. కొన్నేళ్లుగా వీటిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయినా.. కొత్త నిబంధనలు అమలు చేస్తే తమకు వ్యతిరేకంగా మాట్లాడినవారి ఖాతలు బ్లాక్ చేసే అవకాశం ఉండదు కదా. అయినా.. కొత్త ఐటీ చట్టాలపై రాజీ పడే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియా ఏదైనా రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే’ అని అన్నారు.