న్యూఇయర్ కు కావాల్సిన మసాలా నూరుతున్న ఢీ, జబర్దస్త్

ఏవైనా పండగలు వచ్చాయంటే ఇక బుల్లితెరపై సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతికి, ఉగాదికి, దసరాకి మనం బుల్లితెరపై స్పెషల్ కార్యక్రమాలతో ఎంజాయ్ చేసాం. అందులోనూ ఈటివిలో వచ్చే స్పెషల్ కార్యక్రమాలు మంచి ఎంటర్టైనింగ్ గా సాగుతూ ఉంటాయి.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 వస్తోంది కాబట్టి మరో స్పెషల్ ప్రోగ్రాంతో మన ముందుకు వస్తోంది ఈటీవి. అయితే ఈసారి ఈ ప్రోగ్రామ్ ను భిన్నంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఢీ స్టేజ్ పై అదిరే అభి, తాగుబోతు రమేష్, రాకెట్ రాఘవలు వచ్చి తమకు ఢీ స్టేజ్ కావాలని, డిసెంబర్ 31న స్పెషల్ ప్లాన్స్ ఉన్నాయని చెప్పారు. దాంతో శేఖర్ మాస్టర్, ప్రదీప్ తదితరులు కుదరదని మా స్టేజ్ మీకెలా ఇస్తామని అన్నారు. దీంతో ఈ జబర్దస్త్ కమెడియన్స్, తాము పండుతో పాటు మరి కొందరిని కిడ్నాప్ చేసినట్లు వెల్లడిస్తారు. తమకు స్టేజ్ ఇవ్వాలని బెదిరిస్తారు.

దీంతో కొంచెం తగ్గిన శేఖర్ మాస్టర్ మాకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని అడగడంతో జబర్దస్త్ కమెడియన్స్ అక్కడనుండి వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే తమ దగ్గరకి తమకే వార్నింగ్ ఇవ్వడాన్ని ఢీ సభ్యులు జీర్ణించుకోలేక బాబా భాస్కర్ తో వార్నింగ్ ఇప్పిస్తారు. డిసెంబర్ 31న చూసుకుందాం అని అటు ఢీ సభ్యులు, ఇటు జబర్దస్త్ సభ్యులు సవాల్ విసురుకోవడంతో ప్రోమో మంచి రసవత్తరంగా ఎండ్ అయింది.