జబర్దస్త్ కమెడియన్ వినోదిని అలియాస్ వినోద్ ఇంటి కొనుగోలు వివాదం చాలా రోజుల క్రితం మీడియాలో చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. కాచిగూడలో ఇల్లు కొనుగోలు చేసేందుకు 40 లక్షలకు ఒప్పందం చేసుకుని 13.40 లక్షలను అడ్వాన్స్ గా చెల్లించడం జరిగింది. ఇప్పుడు ఆ రేటుకు ఇవ్వనని ఎక్కువ రేటుకు ఇస్తానంటూ ఓనర్ పేచి పెడుతున్నాడు. తాను ఒప్పందం చేసుకున్న విషయాన్ని వినోద్ పోలీసులకు ఇచ్చి ఓన్ తనపై దాడి చేసినట్లుగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
ఓనర్ నుండి తనకు ప్రాణ హాని ఉందని కాపాడాలంటూ తాజాగా వినోద్ పోలీసులను మరోసారి ఆశ్రయించాడు. ఈ విషయంలో ఆయనకు పోలీసులు కోర్టులో కేసు నడుస్తుంది. ఈ విషయంలో ఏం చేయలేం కోర్టు తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఓనర్ నుండి ప్రాణ హాని ఉందని వినోద్ ఆందళన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసు స్టేషన్ వద్ద వినోద్ సన్నిహితులతో కొద్ది సమయం హంగామా చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు మందలించి అక్కడ నుండి పంపించారట.