బాలీవుడ్ నటి జాక్వెలిన్ పెర్నాండేజ్ టెంప్టింగ్ వైరల్ సెన్సేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. జాకీ ఎప్పుడు ఇన్ స్టాకి ఎక్కినా కుర్రాళ్ల మతులు చెడాల్సిందే. అందంతో అగ్గి రాజేయాల్సిందే. డిజైనర్ దుస్తుల్లో అమ్మడి మెరుపుల సంచలనాలు నిరంతరం కొనసాగాల్సిందే. ఆన్ ది స్ర్కీన్ అయినా..ఆఫ్ ది స్ర్కీన్ అయినా జాకీ హాట్ దెబ్బకి లాక్ అవ్వాల్సిందే.
తాజాగా అమ్మడు మరోసారి షోల్డర్ లెస్ దుస్తుల్లో దుమారం రేపుతోన్న ఫోజు ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మిరుమిట్లు గొలిపే టాప్ లో మ్యాచింగ్ స్కర్ట్ తో థై షోతో గుబులు పుట్టిస్తోంది. జాకీ ఎద అందాలు అంతే హైలైట్ అవుతున్నాయి. ఈ ఫోజు సింగిల్ గా థియేటర్లో క్యామ్ కి ఇచ్చినట్లు తెలుస్తుంది.
అదీ సీటులో కూర్చుని కాకుండా..సీట్ హ్యాండిల్ పై వయ్యారంగా కూర్చుని క్యామ్ యాంగిల్ ని ఫిక్స్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. జాకీ అభిమానులు హాట్ కామెంట్లతో మరింత హీటెక్కిస్తున్నారు. ఇటీవలి కాలంలో జాకీ ఫోజుల జోరు నెట్టింట కాస్త తగ్గిందనే చెప్పాలి. కొన్ని నెలలుగా అమ్మడు మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటుంది.
సుకేష్ చంద్రతో ఉన్న వ్యక్తిగత పరిచయం కారణంగా జాకీ పై నెట్టింట నెగిటివిటీ ఎక్కువగా స్ర్పెడ్ అవుతోంది. ఆ మధ్య నెటి జనులు అమ్మడిని విపరీతంగా ట్రోల్ చేసారు. ఇలాంటి ట్రోలింగ్ లు వద్దని వేడుకోవడంతో విడిచిపెట్టారు. అప్పటి నుంచి సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది. రేర్ గా మాత్రమే టచ్ లోకి వస్తోంది. ఈ కారణంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న `హరి హర వీరమల్లు` సినిమాలో అవకాశం కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ ఆరోపణలు బాలీవుడ్ సినిమాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికే కమిట్ అయిన `సిర్కస్`..`రామసేతు` సినిమాలు మినహా కొత్త అవకాశాలేవి చేతిలో లేవు. `విక్రాంత్ రోణా` అనే కన్నడ సినిమాలో స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తోంది.