సహజ నటికి ఏం అయ్యింది?

ఈతరం ప్రేక్షకులకు అమ్మ పాత్ర అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే నటి జయసుధ. కొన్ని వందల సినిమాల్లో అమ్మ పాత్రల్లో నటించిన జయసుధ తన సహజ నటి బిరుదుకు పూర్తి న్యాయం చేసేలా నటిస్తారు అనడంలో సందేహం లేదు. సహజ నటి జయసుధ గత ఏడాది కాలంగా కొత్తగా సినిమాలకు కమిట్‌ అవ్వలేదు. కరోనా లాక్‌ డౌన్‌ టైమ్ నుండి ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన జయసుధ అనూహ్యంగా బక్క చిక్కి, ఏమాత్రం మొహంలో కల లేకుండా కనిపించి అభిమానులకు షాక్‌ ఇచ్చారు.

జయసుధ మరియు శోభన్‌ బాబు నటించిన సినిమాలోని జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు అనే పాట చాలా ఫేమస్‌ అయ్యింది. ఆ పాట లోని పల్లవితో ఇప్పుడు సీరియల్‌ రాబోతుంది. జానకి కలగనలేదు టైటిల్ తో రాబోతున్న సీరియల్‌ ప్రమోషన్‌ లో భాగంగా జయసుధ ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె లుక్ చూసి అంతా నోరు వెళ్ల బెట్టే విధంగా ఉంది. ఆమె బాగా సన్నగా అవ్వడంతో పాటు జుట్టు మరీ తెల్లగా ఉండటం గమనించవచ్చు.

ఇప్పటివరకు జయసుధను తెల్లటి జుట్టుతో చూసింది లేదు. కనుక ఇప్పుడు ఆమెను అలా చూసి జయసుధకు ఏం అయ్యిందని అంటున్నారు. మేకప్‌ లేకుండా జుట్టుకు రంగు వేయక పోవడం వల్ల అలా ఉందని అంతకు మించి ఏమీ లేదని అంటున్నారు.

Share