జానీ మాస్టర్ కి గిప్ట్ గా కాస్ట్ లీ థార్!

టాప్ స్టార్స్ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్ ఒకరు. టాలీవుడ్ అగ్ర హీరోల చిత్రాలకు డాన్స్ కంపోజ్ చేస్తుంటారు. రామ్ చరణ్..ఎన్టీఆర్..బన్నీ.. మహేష్ ఇలా ఇప్పటివరకూ అగ్ర హీరోలందరికీ చిత్రాలకు కొరియోగ్రఫర్ గా పనిచేసారు. ఆ స్టార్లతో జానీమాస్టర్ సాన్నిహిత్యం ప్రత్యేకమైనది. ముఖ్యంగా రామ్ చరణ్- జానీ మాస్టర్ ని ఓ ప్రెండ్ లా ట్రీట్ చేస్తారు. జానీ మాస్టర్ ని కష్ట కాలంలో ఆదుకున్న హీరోగా చరణ్ కి పేరుంది. ఈ విషయాన్ని జానీ మాస్టర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇక అతని ప్రతిభను మెచ్చి పలువురు స్టార్ హీరోలు బహుమతులు అందించిన సందర్భాలున్నాయి. తాజాగా ఇప్పుడా జాబితాలో కిచ్చా సుదీప్ కూడా చేరారు. జానీ మాస్టర్ కి సుదీప్ ఖరీదైన మహీంద్ర థార్ కారుని బహుమతిగా అందించారు. ఈ కార్ కాస్ట్ 15 లక్షలు దాకా ఉంటుంది. దానికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

సుదీప్-జానీ మాస్టర్..థార్ కారు ముందు దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. సుదీప్ నటించిన `విక్రాంత్ రోణా` చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో సుదీప్-జాక్వెలిన్ పెర్నాండేజ్ నటించిన ఓ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు.
జానీ మాస్టర్ కోలీవుడ్ లో కూడా ఫేమస్ కంపోజర్ గా పేరుగాంచారు. అక్కడి స్టార్ హీరోల చిత్రాలకు పనిచేసారు. ఇటీవలే విజయ్ కథానాయకుడిగా నటిస్తోన్న `బీస్ట్` చిత్రంలో `అరబిక్ కుతు` పాటకు డాన్స్ కంపోజ్ చేసారు.

కోరియోగ్రాఫర్లకి..డైరెక్టర్లకి హీరోలు..నిర్మాతలు బహుమతులివ్వడం కొత్తేంకాదు. ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ అప్పుడప్పడు ఇలా బహుమానాలు అందిస్తుంటారు. ఈ కల్చర్ ఎక్కువగా టాలీవుడ్ లో కొనసాగుతుంది. ముఖ్యంగా హీరోలు విషయం ఉన్న నవతరం దర్శకుల్ని ప్రోత్సహిస్తూ ఇలాంటి బహుమతులతో లాక్ చేస్తుంటారు. సందర్భం వచ్చినప్పుడు అవకాశాలు కల్పిస్తుంటారు.