ప్రోమోః రండి గెలుద్దాం అంటున్న ఎన్టీఆర్‌

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో వచ్చేసింది. నేడు ఎన్టీఆర్ తో షో నిర్వాహకులు మరియు జెమిని టీవీ యాజమాన్యం వారు ప్రెస్‌ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ సందర్బంగా ప్రోమో విడుదల చేశారు. ప్రోమోలో ఎన్టీఆర్ ఆకట్టుకున్నాడు. లుక్‌ పరంగా బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ ఇలా అన్నింటి పరంగా కూడా ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంను సూపర్‌ హిట్ చేసే విధంగా ఉన్నాయంటూ నమ్మకం ను ప్రోమో కలిగిస్తుంది.

రండి గెలుద్దాం అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అలాగే ఇక్కడ మీరు ఎంత గెలుస్తారో నాకు తెలియదు కాని ఖచ్చితంగా జీవితంలో ఏదైనా సాధించేందుకు కాన్ఫిడెన్స్ ను మాత్రం మీరు గెలుస్తారని ఆయన చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ ఈ షో ద్వారా తనకు తాను రామారావు అని పిలిపించుకుంటున్నాడు. ఎన్టీఆర్ కంటే రామారావు అనే పేరుతోనే పిలిస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్లుగా ప్రోమో చివర్లో చెప్పిన డైలాగ్ తో అనిపిస్తుంది. మొత్తానికి ఎవరు మీలో కోటీశ్వరులు షో పై మరింత ఆసక్తి కలిగించేలా ప్రోమో ఉంది.