ఫ్యాన్స్‌ సీఎం అంటూ అరుపులపై ఎన్టీఆర్‌ రియాక్షన్‌

తెల్లవారితే గురువారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. జక్కన్న రాజమౌళి మరియు కీరవాణిల కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఈ వేడుకలో పాల్గొన్నాడు. నా కుటుంబ వేడుకకు వచ్చినట్లుగా ఉందని నేను ఇక్కడ ఏదో ప్రత్యేక అతిథిని కాదంటూ ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు. కాస్త ఎమోషనల్‌ గా మాట్లాడుతున్న సమయంలో అభిమానుల్లో కొందరు సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున అరిసిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ సీరియస్ అయ్యాడు.

ఆపండి చాలు, ఆపమన్నా కదా అంటూ అసహనం వ్యక్తం చేశాడు. సమయం సందర్బం లేకుండా అభిమానుల అరుపులపై ఎన్టీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఎన్టీఆర్‌ ఏ కార్యక్రమంలో హాజరు అయినా కూడా అభిమానులు రాజకీయాల గురించి ప్రశ్నిస్తున్నారు. ఆయన రాజకీయ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ఎన్టీఆర్‌ కు మాత్రం అస్సలు ఆసక్తిగా ఉన్నట్లుగా లేదు. ఆయన ముందు ముందు కూడా రాజకీయాల్లోకి వస్తాడా లేదా అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. అభిమానులు మాత్రం ఎప్పటిలాగే సీఎం సీఎం అంటూ నినదిస్తున్నారు.