ఒకప్పుడు హీరోయిన్స్ తమ ప్రేమల విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించే వారు. కాని ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక సమయంలో రిలేషన్ షిప్ కు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. అందుకే కియారా అద్వానీ తన ప్రేమను దాచి పెట్టకుండా తానే బయట పెట్టేసింది. ఈ అమ్మడు బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్దార్థ మల్హోత్రా ప్రేమలో ఉన్నట్లుగా కన్ఫర్మ్ అయ్యింది. ఆయనతో కలిసి కొత్త సంవత్సరం వేడుకల కోసం మాల్దీవులకు చెక్కేసింది.
ఈమద్య కాలంలో ప్రేమ పావురాలు అన్ని కూడా మాల్దీవుల్లో వాలుతున్నాయి. అక్కడ కొంత కాలం పాటు హాయిగా విహరించి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు సిద్దార్థ మల్హోత్రతో కలిసి కియారా అద్వానీ కూడా అక్కడకు వెళ్లింది. తమ డేటింగ్ విషయాన్ని రహస్యంగా ఉంచకుండా ఇద్దరు కలిసి ఒకే కారులో ముంబయి ఎయిర్ పోర్ట్ కు వచ్చి ఇద్దరు కలిసి విమానం ఎక్కారు. దాంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నారనే విషయం క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ అమ్మడు తెలుగులో రెండు సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే.