చందమామ కాజల్ అగర్వాల్ గర్భం దాల్చినా ఇన్ స్టా లో వేగం ఏమాత్రం తగ్గలేదు. నిత్యం బేబి బంప్ ఫోటోలతో అభిమానులకు టచ్ లో ఉంటుంది. మాతృమూర్తి కాబోతున్న తనలో ఉత్సాహాన్ని నిరంతరం అభిమానులతో చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో భర్త గౌతమ్ కిచ్లూ ని సైతం విడిచిపెట్టలేదు. భర్తని సైతం మ్యాగజైన్ కవర్ పేజీల ఫోటోల కోసం రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. ఓవైపు సోలోగా ఫోజులిస్తూనే మరోవైపు హబ్బీతోనూ అందాల ఆవిష్కరణకు వెనకడుగు వేయలేదు.
తాజాగా చందమామ `గ్లోబల్ స్పా` కలర్ పేజీపై తళుక్కున మెరిసింది. వంగపువ్వు రంగు డిజైనర్ దుస్తుల్లో చైర్ పై కుర్చుని క్యూట్ స్మైల్ ఇస్తూ వయ్యారంగా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ కవర్ పేజీ స్టిల్ ఇన్ స్టాలో వైరల్ గా మారింది. ఫోటోని వినాయక్. కె క్యాప్చర్ చేసారు. ఈషామిని స్టైలిస్ట్ కాగా..హెయిర్ అండ్ మేకప్ లో హుమా-సోనియా మోడీ పనితనం చూపించారు. ప్రఖ్యాత మెంబై ఫ్యాషన్ స్టూడియోలో ఈ ఫోటో సెషన్ జరిగింది.
ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే తమిళ్..తెలుగు..హిందీ అంటూ మూడు భాషల్ని చుట్టేస్తోంది. కోలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తోంది. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తయ్యాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన `ఆచార్య` నటిస్తోంది. చిరంజీవితో కలిసి నటించడం ఇది రెండవ సారి. గతంలో `ఖైదీ నెంబర్ 150` లో మెగాస్టార్ కి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్ద హిట్ అయింది.
అదే సెంటిమెంట్ తో కొరటాల శివ మరోసారి కాజల్ ని చిరు సరసన `ఆచార్య`లో రిపీట్ చేసారు. `ఇండియన్ -2` లో విశ్వ నటుడు కమల్ హాసన సరసన నటిస్తోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. కాజల్ పై చిత్రీకరణకు సంబంధించి దాదాపు షూట్ పూర్తయినట్లు సమాచారం. కాజల్ గర్భం దాల్చిన తర్వాత షూటింగ్ లకు దూరమైంది. అలాగే కొత్త ప్రాజెక్ట్ లు తగ్గుముఖం పట్టాయి.