సీనియర్ నటుడికి సతీ వియోగం

సుదీర్ఘ కాలం పాటు నటుడిగా అలరించిన కాకరాల సత్యనారాయణ భార్య సూర్యకాంతం అనారోగ్య సమస్యతో మృతి చెందారు. 80 ఏళ్ల ఆమె గుండెకు సంబంధించిన సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. భర్త కాకరాలతో కలిసి సూర్యకాంతం గారు కొండాపూర్ లోని సీఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వృద్దాశ్రమంలో ఉంటున్నారు. 200 సినిమాలకు పైగా నటించిన కాకరాల ఆస్తులను కూడబెట్టుకోలేక పోయారు. దాంతో చివరి అంకంలో వృద్దాశ్రమంలో ఉంటున్నారు.

కాకరాల భార్య సూర్యకాంతం మృతి పై సన్నిహితులు మిత్రులు దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. ఆమె భర్త కాకరాల మృత దేహంను ఉస్మానియా మెడికల్‌ కాలేజ్ కు ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు. ఆమె తన కంటిని ఎల్వీ ప్రసాద్‌ ఐ ఆసుపత్రికి డొనేట్ చేశారు. ఇప్పటికే కంటి ఆసుపత్రి వారు కళ్లను సేకరించడంతో పాటు ఉస్మానియా మెడికల్‌ కాలేజ్ వారు మృత దేహంను స్వాదీనం చేసుకున్నారు. కాకరాలతో అనుబంధం ఉన్న పలువురు సినీ ప్రముఖులు ఆయన్ను ఫోన్‌ ద్వారా పరామర్శించారు. ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా విప్లవోద్యమంలో ఉన్నారు.