టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై చెప్పుల దాడి ఘటనలో భాగంగా పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బుధవారం రాత్రి రాజాంలోని కళా వెంకట్రావు ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అయితే ఆయన్ను ఏ పోలీస్ స్టేషన్కు తరలించారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు కళావెంకట్రావు నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు కళా వెంకట్రావు నివాసానికి భారీగా చేరుకున్నారు. పోలీసుల చర్యను ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళా వెంకట్రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.