మొదటి వారమే తమిళ బిబిలో రచ్చ


గతంలో ఎప్పుడు లేనిది తెలుగు.. తమిళం మరియు హిందీ బిగ్ బాస్ లు ఒకేసారి కొనసాగుతున్నాయి. తెలుగు బిగ్ బాస్ ప్రారంభం అయ్యి అయిదు వారాలు ముగియబోతుండగా హిందీ మరియు తమిళ బిగ్ బాస్ లు ఇటీవలే ప్రారంభం అయ్యాయి. తమిళ బిగ్ బాస్ కు వరుసగా నాల్గవ సీజన్ కు కూడా యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హోస్టింగ్ చేస్తున్నాడు. మొదటి సీజన్ నుండి తాజా సీజన్ వరకు ఆయన హోస్టింగ్ లో పరిణితి కనిపిస్తూనే ఉంది. సమయస్ఫూర్తిగా హోస్టింగ్ చేస్తూ కమల్ మంచి పేరు దక్కించుకున్నాడు.

నిన్న ప్రసారం అయిన మొదటి వీకెండ్ ఎపిసోడ్ లో కమల్ హాసన్ మరో సారి తనదైన శైలిలో ఇంటి సభ్యులను సున్నితంగా మందలించాడు. మొదటి వారంలోనే ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. ఒకరు ఇద్దరు ఏకంగా నువ్వెంత అంటే నువ్వు ఎంత అన్నట్లుగా రెచ్చి పోయారు. అంతటి గొడవలు జరిగిన బిగ్ బాస్ ఇంటి సభ్యులను మందలించడంతో పాటు మళ్లీ ఇలాంటివి జరగకూడదు అంటూ హెచ్చరించాడు. గొడవలు పక్కకు పెట్టి ఆటపై దృష్టి పెట్టాలంటూ సూచించాడు.

ఈ సీజన్ లో కమల్ తో గతంలో హీరోయిన్ గా నటించిన రేఖ ఉన్నారు. ఆమెతో నిన్నటి ఎపిసోడ్ లో కాస్త చనువుగా మాట్లాడిన కమల్ ఇతర ఇంటి సభ్యులందరిని కూడా ఒక వైపు తప్పు చేస్తే మందలించడంతో పాటు వారితో సరదాగా టైం స్పెండ్ చేశాడు. 19 ఏళ్ల అతి చిన్న కంటెస్టెంట్ అయిన శివానితో ప్రత్యేకంగా పాట పాడించుకుని మరీ కమల్ ఆ పాటను ఆస్వాదించాడు. అనిత మరియు సురేష్ ల మద్య జరిగిన గొడవపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమల్ ఆ సమయంలో అనితపై సురేష్ నోరు చేసుకోవడంను తప్పుబట్టాడు.

ఆ గొడవను మరింత పెంచకుండా అక్కడితో వదిలేయాలంటూ సూచించి ఆటను ముందుకు తీసుకు వెళ్లాడు. ఇక నేటి ఎపిసోడ్ లో కమల్ మరింత సందడి చేయబోతున్నట్లుగా ప్రోమో చూస్తుంటే అర్థం అవుతుంది. ఒక వైపు సినిమా మరో వైపు రాజకీయాలు ఇప్పుడు హోస్టింగ్ కమల్ ఎలా ఇన్నింటిని మేనేజ్ చేస్తున్నాడు అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.