చిరుతో కలిసి నటించడంపై కంచెరపాలెం నటుడు ఏమన్నాడంటే..?

కేరాఫ్ కంచెరపాలెం సినిమాలో వినాయకుడి విగ్రహాలు చేసే వ్యక్తి పాత్ర గుర్తుందా? తన కొడుకు వల్లే విగ్రహం దెబ్బతింటుంది. పెట్టిన పెట్టుబడి మొత్తం పోయేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ పాత్రను హృదయానికి హత్తుకునేలా పోషించాడు కిషోర్ అనే థియేటర్ నటుడు. ఆ సినిమాలో విచారకరమైన ముగింపు వచ్చినా కానీ కిషోర్ కు ఇప్పుడు అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య సినిమాలో కంచెరపాలెం కిషోర్ కూడా నటిస్తున్నాడు.

ఈరోజుతో తన పాత్ర చిత్రణ పూర్తయింది. ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసుకున్నాడు. కంచెరపాలెం సినిమాను చూసి చిరంజీవి తనను ఎంతో మెచ్చుకున్నారని, చిన్నప్పుడు చిరంజీవి ఫోటోలను కట్ చేసుకుని తన ప్లాంక్ పై అంటించుకునేవాడిని అని, అది ఆయనతో పర్సనల్ గా షేర్ చేసుకుంటానని అస్సలు అనుకోలేదని అన్నాడు. అలాగే తనకు ఈ అవకాశం ఇచ్చిన కొరటాల శివకు కృతఙ్ఞతలు తెలియజేసాడు.