తెలుగు వెండి తెరపై మరియు బుల్లి తెరపై సందడి చేసిన నటి కరాటే కళ్యాణి ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో సందడి చేసిన విషయం తెల్సిందే. మల్టీ ట్యాలెంటెడ్ అయిన కరాటే కళ్యాణి అనూహ్యంగా రెండవ వారంలోనే ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చేసింది.
బిగ్ బాస్ లో ఆమె ఉంటే ఖచ్చితంగా ఎంటర్ టైన్ మెంట్ ఉండేది. కాని ఆమె పదే పదే గొడవలు పడుతున్న కారణంగా ఆమెను ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. బిగ్ బాస్ తర్వాత అనూహ్యగా స్పీడ్ పెంచిన కరాటే కళ్యాణి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.
కరాటే కళ్యాణి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇటీవల రామతీర్థలో జరిగిన సంఘటనపై నిరసన తెలిపేందుకు ఆమె విజయనగరం చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆమె స్పందిస్తూ తాను హరికథ చెప్పడం మొదలు పెట్టింది ఇక్కడే. భద్రాద్రి మాదిరిగా మేము ఇక్కడ రాముడిని కొలుచుకుంటాం. అలాంటి రాముడి ఆలయంకు రక్షణ లేకుండా పోయింది. రాముల వారి తల తీసుకు వెళ్లిన వారిని వెంటనే పట్టుకుని వారి తల మా ముందు పెట్టాలంటూ సీఎంపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది.
దేవాలయాలపై వరుసగా జరుగుతున్న ఇలాంటి దాడులకు బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. కరాటే కళ్యాణి వైకాపా ప్రభుత్వంపై మరింతగా వ్యాఖ్యలు చేశారు.