కార్తీక దీపం హిమ రియల్ లైఫ్ బాధ గుండెను మెలిపెడుతుంది

సిల్వర్ స్క్రీన్ తో సమానంగా ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుంది బుల్లితెర. ముఖ్యంగా సీరియల్స్ ఆడవాళ్లను ఎంటర్టైన్ చేస్తుంటాయి. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో బ్లాక్ బస్టర్ రేంజ్ ను అందుకుంది కార్తీక దీపం. ప్రస్తుతం ఈ సీరియల్ గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నా కానీ కార్తీక దీపం ఇంకా విజయవంతంగా దూసుకుపోతోంది.

ఇక అసలు విషయానికొస్తే కార్తీక దీపంలో వంటలక్క కూతుళ్లుగా నటించారు హిమ, శౌర్య. అందులో హిమ పాత్ర నల్లగా ఉంటుంది. ఆ పాత్రను సహృద పోషించింది. సీరియల్ లో తండ్రి ప్రేమను చూరగొన్న పాత్రను పోషించిన సహృద నిజ జీవితంలో మాత్రం తండ్రి ప్రేమకు నోచుకోలేదట.

సహృద పుట్టిన తర్వాత ఆడపిల్ల పుట్టిందని ఆమె తండ్రి దగ్గరకి కూడా రాలేదట. ఇక కార్తీక దీపం సీరియల్ లో ముఖానికి నల్ల మేకప్ వేసుకున్నప్పుడు తొలుత ఇబ్బంది పడ్డానని, కానీ ఇప్పుడు ఈ రోల్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది సహృద.