మన యంగ్ హీరో ను వదల్లేక పోతున్న బోనీ కపూర్‌

శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ తమిళంలో అజిత్ హీరోగా నిర్మిస్తున్న వాలిమై సినిమాలో కీలక పాత్రలో కార్తికేయ నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో కార్తికేయ వర్కింగ్‌ స్టైల్‌ నచ్చడంతో బోణీ కపూర్‌ మళ్లీ మళ్లీ సినిమాలను ఆయనతో నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వరుసగా సినిమాలను నిర్మిస్తున్న బోనీ కపూర్‌ తెలుగులో కార్తికేయతో రెండు సినిమాలు నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

వాలిమై సినిమా పూర్తి అయిన వెంటనే కార్తికేయ తో వరుసగా రెండు సినిమాలను తెలుగులో నిర్మించి పాన్ ఇండియా సినిమాలుగా విడుదల చేయాలని భావిస్తున్నాడట. అందుకు సంబంధించిన కథా చర్చలు కూడా జరుగుతున్నాయి. కార్తికేయను బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మొత్తానికి బోణీ కపూర్‌ దృష్టిలో పడి వరుసగా ఆయన బ్యానర్ లో సినిమాలు చేసే అవకాశం దక్కించుకోవడంతో పాటు బాలీవుడ్‌ వెళ్లేందుకు కూడా సిద్దం అవుతున్నాడు.