కాంగ్రెస్ లో చేరనున్న కత్తి కార్తీక

ప్రముఖ టివి యాంకర్ కత్తి కార్తీక, బిగ్ బాస్ 1 లో పాల్గొని ఫేమ్ సంపాదించింది. గత రెండేళ్ల నుండి కార్తీక రాజకీయంగా పైకి రావడానికి కృషి చేస్తోంది. దుబ్బాక నియోజకవర్గం ప్రధానంగా తన రాజకీయ భవిష్యత్ ను రూపొందించాలని భావిస్తోంది. 2020 నవంబర్ దుబ్బాక బై ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కార్తీక బాగానే కష్టపడింది. అయితే దురదృష్టవశాత్తూ ఓడిపోయింది. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.

ఈ నేపథ్యంలో సొంతంగా రాజకీయం చేయడం కంటే ఒక పెద్ద పార్టీ సపోర్ట్ ఉంటే బెటర్ అని భావించిన కార్తీక, కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకుంది. ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ను కలిసి పార్టీలో చేరడానికి తన ఆసక్తిని తెలిపింది. మధు యాష్కీ సాదరంగా ఆమెను ఆహ్వానించారు. త్వరలోనే ఆమె కాంగ్రెస్ లో చేరనుంది.