ప్రముఖ క్రిటిక్, సోషల్ యాక్టివిస్ట్ కత్తి మహేష్ కు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన విషయం తెల్సిందే. ఈ రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ కు తల, ముక్కు, కళ్ళు భాగాల్లో తీవ్రంగా గాయాలు అయ్యాయి. ముందు నెల్లూరులో చికిత్స అందించగా ఆ తర్వాత చెన్నైలోని అపోలో హాస్పిటల్ కు మహేష్ ను షిఫ్ట్ చేసారు.
ఇదిలా ఉంటే మహేష్ ఆరోగ్య పరిస్థితిపై రకరకాల రూమర్స్ వస్తున్నాయి. అయితే వాటిలో నిజాలు లేవని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. మహేష్ కు జరగాల్సిన సర్జరీలు అన్నీ జరిగాయట. అయితే తనకు చూపు పోయిందని వార్తలు వచ్చాయి కానీ మహేష్ కుటుంబ సభ్యులు ఈ విషయంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు.
ఇక మహేష్ ను సపోర్ట్ చేయడానికి అతని సన్నిహితులు ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరికొన్ని వారాల పాటు మహేష్ హాస్పిటల్ లోనే ఉండాలని చెబుతున్నారు.