కత్తి మహేష్‌ మృతి అనుమానాలపై స్పందించిన మంత్రి

సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్‌ మృతి పై అనుమానాలు ఉన్నాయంటూ మంద కృష్ణ మాదిగ చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పందించాడు. మహేష్‌ మృతిపై ప్రత్యేక విచారణకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించాడు. కత్తి మహేష్ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు త్వరలోనే విచారణ కమిటీ ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా మంత్రి ప్రకటించారు. ఇక కత్తి మహేష్‌ కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా మంత్రి అన్నారు.

డ్రైవింగ్‌ సీటులో ఉన్న సురేష్‌ కు ఎక్కువ గాయాలు కాకుండా కేవలం పక్కన కూర్చున్న కత్తి మహేష్‌ కు ఎక్కువ ప్రమాదం జరగడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే సురేష్‌ ను పోలీసులు స్టేషన్ కు పిలిచి విచారించారు. యాక్సిడెట్‌ జరిగిన తీరును గురించి ప్రశ్నించారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఉన్న పరిస్థితుల గురించి కూడా పోలీసులు సురేష్‌ నుండి వాంగ్మూలంను నమోదు చేయడం జరిగింది. కత్తి మహేష్‌ మృతి పలువురు సంతాపం తెలియజేశారు. కత్తి మహేష్‌ మృతి పై అనుమానాలను ఏపీ పోలీసులు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.