సరోగేట్ తల్లిగా నటించనున్న కీర్తి సురేష్?

బాలీవుడ్ లో ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న చిత్రాల్లో మిమీ ఒకటి. కృతి సనన్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. సరోగేట్ తల్లిగా కృతి సనన్ ఈ చిత్రంలో కనిపించింది. అటు హ్యూమర్, ఇటు ఎమోషన్స్ కూడా మిమీలో అద్భుతంగా పండాయి.

ముఖ్యంగా కృతి సనన్ కు ఈ చిత్రం ద్వారా చాలా మంచి పేరొచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పుడు సౌత్ లో రీమేక్ కాబోతోందని సమాచారం. ఛాలెంజింగ్ గా అనిపించే కృతి సనన్ రోల్ ను సౌత్ లో కీర్తి సురేష్ చేయనుందిట. తెలుగు, తమిళ్ లో ఈ సినిమాను రూపొందిస్తారు. మిగిలిన భాషల్లో డబ్ చేసే అవకాశముంది.

అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.