కేజీఎఫ్‌ 2 రిలీజ్.. మోడీకి ఫ్యాన్స్ రిక్వెస్ట్‌

కన్నడంలో రూపొందిన కేజీఎఫ్‌ సినిమా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మొత్తం భారతదేశం అన్ని భాషల సినీ ప్రేమికులను కూడా కేజీఎఫ్ సినిమా ఆకట్టుకుంది. మొదటి పార్ట్‌ రికార్డు బ్రేకింగ్ వసూళ్లను నమోదు చేసిన నేపథ్యంలో రెండవ పార్ట్‌ ఎంత వరకు వసూళ్లను సాధిస్తుందో అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. మొదటి పార్ట్‌ కు రెట్టింపు గా రెండవ పార్ట్‌ ఉంటుందని అంటున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న కేజీఎఫ్‌ 2 విడుదల తేదీ ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. జులై 16న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదల అవుతున్న జులై 16వ తారీకున దేశ వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి కేజీఎఫ్‌ అభిమానులు విజ్ఞప్తి చేశారు. మా అభిప్రాయంను అర్థం చేసుకుని దేశంలో ఆ రోజున సెలవు ఇవ్వాలంటూ అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానికి యశ్‌ అభిమాని చేసిన రిక్వెస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.