హిందీలో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్న కేజిఎఫ్ చాప్టర్ 2

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజిఎఫ్ చాప్టర్ 2 విజయపరంపర కొనసాగుతోంది. మొదటి రోజే కేజిఎఫ్ ప్రభంజనం చూపించగా ఆ తర్వాతి నుండి దాన్నే సస్టైన్ చేసుకుంటూ వచ్చింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ కలెక్షన్స్ దుమ్ము లేపాయి. తొలి రోజే 53 కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది కేజిఎఫ్ హిందీ వెర్షన్.

అప్పటినుండి పెద్దగా డ్రాప్స్ లేకుండా ముందుకు సాగిపోయిన ఈ చిత్రం వారం రోజులు పూర్తయ్యేసరికి 250 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. మరే ఇతర చిత్రం కూడా ఇంత త్వరగా ఈ ల్యాండ్ మార్క్ ను చేరుకోలేదు.

ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ బాహుబలి 2 కు 8 రోజులు పట్టింది. ఫుల్ రన్ లో కేజిఎఫ్ చాప్టర్ 2 మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.