రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మగధీర సినిమాలో ఐటెం సాంగ్ చేసిన కిమ్ శర్మ గుర్తు ఉంది కదా.. ఆమె కొన్నాళ్ల క్రితం హర్షవర్థన్ రానే తో బ్రేకప్ అయ్యింది. ఆ మద్య సినిమాల్లో బిజీ బిజీగా గడిపిన కిమ్ శర్మ ఎక్కడ చూసినా ఆమె కనిపించేది. కాని ఇప్పుడు మాత్రం మీడియాలో వార్తలతో కనిపిస్తుంది. ఆమద్య బ్రేకప్ చెప్పిన కిమ్ శర్మ కొత్త ప్రేమను వెతుక్కున్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
టెన్నీస్ దిగ్గజం లియాండర్ పేస్ తో ఈమె డేటింగ్ కు వెళ్లింది. గోవాలోని ఒక రెస్టారెంట్ లో వీరిద్దరు ఇలా చాలా క్లోజ్ గా కనిపించారు. ఈ ఫొటోలతో ఒక్కసారిగా వీరిద్దరి మద్య ఏం ఉంది అంటూ పుకార్లు షికార్లు మొదలు అయ్యాయి. సాదారణ డేట్ కు వెళ్లారా లేదంటే ఇద్దరు స్నేహితులు మాత్రమేనా లేదంటే వీరి మద్య కొత్త ప్రేమ మొదలు అయ్యిందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ రిలేషన్ షిప్ గురించి ఎవరు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ముందు ముందు అయినా వీరిద్దరులో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తారేమో చూద్దాం.